హైదరాబాద్: ప్రభుత్వ కార్యక్రమాలు నచ్చే తాను ప్రచారం చేశానని ప్రముఖ నటుడు నాగార్జున చెప్పారు. నాగార్జునను బుధవారం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడైన కాంగ్రెస్ నాయకుడు అంబటి రాంబాబు కలిశారు. నాగార్జున నటించిన యాడ్స్ చాలా బాగా వచ్చాయని, అందుకు నాగార్జునను అభినందించడానికి వచ్చానని అంబటి రాంబాబు చెప్పారు. నాగార్జునకు ప్రభుత్వ కార్యక్రమాలు బాగా నచ్చాయని, అందుకే యాడ్స్ లో మనస్ఫూర్తిగా నటించారని ఆయన అన్నారు.