కాంగ్రెస్ వైపు బిజెపి ఎమ్మెల్యే
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం భారతీయ జనతా పార్టీ (బిజెపి) పిఠాపురం శాసనసభ్యుడు దొరబాబు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన వచ్చే రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. తాను పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నానని, వివరాలు రెండు రోజుల్లో తెలియజేస్తాననియన మీడియా ప్రతినిధులతో అన్నారు.
దొరబాబు చాలా కాలంగా బిజెపి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్ ధిక్కరించి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నిజానికి ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరుతారని ఊహాగానాలు చెలరేగాయి. అయితే, ప్రజారాజ్యం పార్టీ ఆయనకు పిఠాపురం టికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు, ఆ సీటును వంగా గీతకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో పిఠాపురం టికెట్ కోసం ఆయన కాంగ్రెసులో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications