భవనం కూలి ఐదుగురు మృతి
ముంబయి: దక్షిణ ముంయిలోని క్రాఫోర్డ్ మార్కెట్లో బుధవారం ఉదయం ఐదంతస్థుల భవనం కూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించినట్లు అనుమానిస్తున్నారు. కూలిన సయ్యద్ హౌస్ భవనం శిథిలాల కింద మరికొంత మంది ఉండవచ్చునని భావిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎనిమిది ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications