బాబు, రామోజీలు నేరస్థులు: కిరణ్ కమార్
అనంతపురం: మొద్దు శీను హత్య కేసులో మొదటి నేరస్థుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అని, రెండో నేరస్థుడు ఈనాడు దిన పత్రిక అధిపతి రామోజీ రావు అని ప్రభుత్వ చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొద్దు శీను హత్య కేసులో తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసుల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
మొద్దు శీను హత్యలో జైలు అధికారుల వైఫల్యం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకు బాధ్యులైనవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. ఏ రకంగానూ అధికారంలోకి రాలేమని గ్రహించిన చంద్రబాబు శవరాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications