వైయస్ కు భారతరత్న ఇవ్వాలి: మారెప్ప
నెల్లూరు: తమ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి భారతరత్న ఇవ్వాలని మంత్రి మారెప్ప అన్నారు. ఏ చిరు గాలులు కూడా తమ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేవని ఆయన బుధవారం వ్యాఖ్యానించారు. చిరంజివి నేతృత్వంలోని ప్రజారాజ్యం కులతత్వ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చంద్రమండలానికి తప్ప రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీలోనివారిని కూడా ఆయన వదిలిపెట్టలేదు. తమ పార్టీలోని నడవలేనివాళ్లు, ముసలివాళ్లు ప్రత్యేక తెలంగాణ అంటున్నారని, రాజకీయ నిరుద్యోగులే తెలంగాణ రాష్ట్రం కావాలని అడుగుతున్నారని ఆయన అన్నారు. తాము సమైక్యరాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications