మార్గరెట్ అల్వా రాజీనామా ఆమోదం
న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవికి మార్గరెట్ అల్వా చేసిన రాజీనామాను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు సీట్లు అమ్ముకున్నారని ఆమె ఆరోపించటంతో పార్టీ క్రమశిక్షణాసంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. వారికి ఆమె స్వయంగా వివరణ ఇచ్చారు. అనంతరం సోనియాగాంధీని కలిశారు. అనంతరం ఆమె మంగళవారం ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. దీన్ని అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు.
బుధవారం ఉదయం ఆల్వా రాజీనామాను సోనియా గాంధీ ఆమోదించారు. మార్గరెట్ అల్వాను సీడబ్ల్యూసీ మెంబర్‌గా, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యురాలిగా కూడా తప్పించారు. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, మిజోరం రాష్ట్రాల ఇన్‌ఛార్జిగా కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications