హైదరాబాద్ : తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పోలీసులపై దిగజారి మాట్లాడడం ఆయనలోని అసహనాన్ని తెలియజేస్తుందని మార్కెటింగ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. భీమ్‌రావ్‌బాడాలో పోలీసులపై తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. 80 కుటుంబాలు కూడాలేని ఓవాడ కూల్చివేతను.. జాతీయ స్థాయికి ఎలా తీసుకువెళతాడో చెప్పాలని బొత్స ఎద్దేవా చేశారు.కమ్యూనిస్టుల పార్టీ కార్యాలయ స్థలం ఎక్కడిదో వారికి తెలియదా అంటూ వామపక్షాలపై మండిపడ్డారు. విలువల్ని, సంస్కారాన్ని మరచి ప్రవర్తిస్తున్న విపక్షాలకు కొత్త ఏడాదిలోనైనా మంచి బుద్దిరావాలని కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఏమైనా తప్పులుంటే ఎత్తి చూపాలన్నారు.