లారీల సమ్మె-మూడవరోజు
న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా గత రెండు రోజులుగా జరుగుతున్న లారీలు, ట్రక్కుల యజమానుల సమ్మె మూడవరోజు కూడా కొనసాగుతోంది. ప్రభుత్వం దిగివచ్చేవరకు సమ్మె విరమించేది లేదని ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ సంఘంలో 60 లక్షలమంది ట్రక్ యజమానులు ఉన్నారు. సమ్మె విరమించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి టీ ఆర్ బాలు చేసిన విజ్ఞప్తిని వారు ఖాతరు చేయటంలేదు. డీజిల్ ధర తగ్గించాలని, ట్రక్కులపై సర్వీస్‌టాక్స్ తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మె వలన నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యజనం చాలా ఇబ్బంది పడుతున్నారు.












Click it and Unblock the Notifications