ఒంగోలు: తనపై అసభ్యకూతలు కూస్తే కార్యకర్తలే వారికి తగిన బుద్ధి చెబుతారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.అయినా నేను ఏం చేస్తున్నది ఏ సందుల్లోంచి తొంగిచూశారు. ఎప్పుడు, ఎందుకు అలాచేశారు. ఆ అలవాటు వారికి ఎందుకు ఉంది. నాకు మధ్యాహ్నం వరకు మత్తు వదలకపోవడంతో బయటకు రావడంలేదని అన్నారు. గురువారం రాత్రి ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. జ్వరంతో బాధపడుతూ ఉదయం 8,9 గంటల వరకు విశ్రాంతి తీసుకున్నానని, అంతమాత్రాన తాను మత్తుదిగక పడుకున్నానని అసభ్యంగా మాట్లాడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అపర భగీరథుడు కాదు అపర ధనయజ్ఞ నిర్వాహకుడని చిరంజీవి విమర్శించారు.