సత్యం కొత్త బోర్డు ప్రకటన
న్యూఢిల్లీ: సత్యం పాత బోర్డును రద్దు చేసిన కేంద్రం ఆదివారం ముగ్గురు డైరెక్టర్లతో కూడిన కొత్త బోర్డును ప్రకటించింది. బోర్డు సభ్యులుగా కిరణ్‌కార్నిక్, దీపక్ పరేఖ్, అచ్యుతన్ నియమితులయ్యారు. కొత్తబోర్డులో మొత్తం 10 మంది సభ్యులుంటారని ఇతర సభ్యులను బోర్డే ఎన్నుకుంటుందని కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రి ప్రేమ్ చంద్ గుప్తా తెలిపారు. సత్యం కంప్యూటర్‌సపై ప్రజలు కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి కొత్త బోర్డు తీసుకురాగలదనే ఆశాభావాన్ని గుప్తా వ్యక్తం చేశారు. కిరణ్‌కార్నిక్ గతంలో నాస్‌కామ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చైర్మన్ గా దీపక్ పరేఖ్ కొనసాగుతున్నారు. ఇక రానున్న 24 గంటల్లోపే బోర్డు సమావేశం కానుందని తెలసింది.












Click it and Unblock the Notifications
