బీఎస్పీతో పొత్తుకి రెడీ:చిరంజీవి

సత్యం కుంభకోణంలో పాలకపక్షనేతల హస్తం ఉందనేది బహిరంగ రహస్యమన్నారు. వాన్‌పిక్ పేరుతో తీరప్రాంత భూములసేకరణకు ప్రభుత్వం దళారీపాత్ర పోషించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. నాలుగు రోజులలో కమిటీ కన్వీనర్, సంస్థాగత కమిటీలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత విద్యుత్ ఇచ్చే ఆలోచనపై అధ్యయనం జరుగుతుందన్నారు.హింసాత్మక సంఘటనలకు ఎలక్ట్రానిక్ మీడియాలో అధికప్రాధాన్యం ఇచ్చి చూపడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలకు విద్యతో పాటు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా అభివృద్ధిలో వెనుకబడి ఉండటం తన దృష్టికి వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications