విప్రోపై కూడా ప్రపంచబ్యాంకు వేటు
న్యూఢిల్లీ: సత్యం ప్రభావం భారత్‌కు చెందిన పలు ఇతర ఐటీ కంపెనీలపై కూడా పడుతోంది. ప్రముఖ ఐటీ కంపెనీలైన విప్రో, మెగాసాఫ్ట్ కంపెనీలకు కూడా తమ కాంట్రాక్టులు ఇవ్వరాదని ప్రపంచబ్యాంకు నిర్ణయించింది. ఈ బ్యాంకునుంచి డైరక్ట్ కాంట్రాక్టులేవీ వారికి ఇవ్వరాదని నిర్ణయించారు. పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు వర్గాలు తెలిపాయి. నాలుగేళ్లపాటు ఈ నిషేధం అమలులో ఉంటుందని తెలిపారు. సత్యంకు డిసెంబర్ 25న ఈ బ్యాంకు కాంట్రాక్టులు రద్దుచేశారు.












Click it and Unblock the Notifications