అమెరికాలో మరో తెలుగుతేజం హత్య
హైదరాబాద్: ఉన్నత స్ధాయికి ఎదుగుదామంటూ..అమెరికాకు ఎగిరిపోయిన రాష్ట్రానికి చెందిన ఓ యువ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఫాల్కన్ జెట్‌ఎయిర్‌వేస్ కంపెనీలో మెకానికల్ ఇంజినీరుగా పని చేస్తున్న ఇవరై ఆరేళ్ళ అక్షయ్ విశాల్ ని గుర్తు తెలియని దుండగుల దారుణానికి బలయ్యారు. అమెరికాలోని ఆర్కాన్సాస్‌లో ఉంటున్నారు. స్ధానికంగా ఉన్న ఫాల్కాన్ ఎయిర్ వేస్ లో మూడేళ్ళుగా అతను పనిచేస్తున్నాడు. భోగి శుభాకాంక్షలు తన తల్లి తండ్రులకు ఫోన్ లో తెలియచేసిన అతను ఆఫీసులో తన విధులు ముగించుకుని ఇంటికి వచ్చేసరికి అక్కడ అప్పటికే ఉన్న ఓ ఆఫ్రికన్ చేతిలో బలయ్యాడు. డబ్బు ఇవ్వమంటే అక్షయ్ ..లేదన్నాడని అతను ఘోరంగా కాల్చివేసి పారిపోయినట్లు సమాచారం.
ఇదంతా ఈ నెల 13వ తేదీన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడుగంటలకు విశాల్ నివసిస్తున్న లిటిల్‌రాక్‌టౌన్ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. తీవ్రంగా గాయపడిన విశాల్‌ను అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించి, బేగంపేటలో ఉంటున్న అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున విశాల్ మృతి చెందాడు. విశాల్ తండ్రి నందం లక్ష్మణమూర్తి బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉన్నతోద్యోగి. డబ్బు కోసం నల్లజాతీయులు తమ కుమారుడిని హత్య చేసి వుంటారని లక్ష్మణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.విశాల్ భౌతిక కాయాన్ని ఇండియా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవి త్వరగా జరగాలని అక్షయ్ తల్లితండ్రులు వేదనగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications