నష్టాల బాట వీడని మార్కెట్
ముంబయి: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ప్రకంపనల ప్రభావం స్టాక్ మార్కెట్‌ను ఇంకా వీడలేదు. వారం రోజులుగా సెన్సెక్స్ సూచీ నష్టాలను సూచిస్తోంది. తాజాగా గురువారం 315 పాయింట్లు నష్టపోయి సూచీ 9055 వద్ద.... నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి సూచీ 2743 పాయిట్ల వద్ద నిలిచింది. జయప్రకాష్ అసోసియేట్స్, టాటాస్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీగా నష్టపోయాయి. గ్రాసిం ఇండస్ట్రీస్, రాన్‌బాక్సీ, మహీంద్రా లాభాలు పొందాయి.












Click it and Unblock the Notifications