హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ స్ధానం నుంచి లోక్‌సభకు ఆయన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంగళవారం ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అయితే వీటిని అజహార్ ఖండించారు. తనకు ఇప్పుడే పార్టీ తీర్థం పుచ్చుకునే యోచన లేదని స్పష్టం చేశారు. అజహర్ కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రిని, సోనియాను కలిశారు.
ఎన్నో దశాబ్దాలుగా మజ్లిస్ కు కంచుకోటలా ఉన్న హైదరాబాద్ లోక్ సభ స్ధానాన్ని కైవసం చేసుకోవాలంటే అజర్ వంటి అభ్యర్ధిని నిలబెట్టడం ఒక్కటే మార్గమని రాష్ట్ర నాయకులు సోనియా గాంధీకి సూచించినట్టు తెలుస్తోంది.