'సత్యం' డబ్బుదోచుకుంది రాజే!

జనవరి 7న బోర్డుకు రామలింగరాజు ఒక లేఖ రాస్తూ, వంద కోట్ల డాలర్ల రిజర్వు నిధులు కల్పితమని ప్రకటించిన విషయం విదితమే. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న విచారణాధికారి ఒకరు నిధుల మళ్లింపు విషయాన్ని ధృవ పరిచారని, పేరు తెలపడానికి మాత్రం ఇష్టపడలేదని యుఎస్ డైలీ పేర్కొంది.
వంద కోట్ల డాలర్ల నిధులను (సుమారు అయిదు వేల కోట్ల రూపాయలు) రామలింగరాజు అత్యంత చాకచక్యంగా మళ్లించారని, ఇందుకోసం 300లకు పైగా కంపెనీలను సృష్టించినట్లు తెలిపింది. ఈ కంపెనీలన్నీ రాజు పేరు మీదనో లేదా అతని కుటుంబ సభ్యుల పేరు మీదనో రిజిస్టర్ అయ్యాయని, దీనితో సత్యం వ్యవహారం మరింత క్లిష్టంగా మారిందని న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications