ఆళ్లగడ్డ: జనం సినిమా టిక్కెట్ల కోసం పెట్టిన డబ్బుతో కోట్లు ఆర్జించిన కొత్త కొత్త వేషగాళ్ళు కూడా ఓట్ల కోసం వస్తున్నారని అలాంటి వారి విషయంలో ఉండాలని బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ చిరునుద్దేసించి వ్యాఖ్యలు చేసారు. అలాగే రాష్ట్రంలో అధికారాన్ని పిప్టీ పిఫ్టీ చేసుకోవాలని చూస్తున్న కొన్ని పార్టీలు ప్రజల్ని మరోసారి మోసం చేయాలనుకుంటున్నాయని,వాటికి ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో ఎమ్మెల్యే గంగుల ప్రతాపరెడ్డి అధ్యక్ష్యతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టి పేదలు,మహిళలు హృదయాల్లో చిరస్ధాయిగా చోటు చేసుకున్నామని వివరించారు.