చిరు నినాదంతో బాలయ్య?

అసలు తెలుగుదేశం హయాంలోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం అనే ఆలోచన పుట్టిందని ఆయన ప్రజలకు మరీ మరీ చెప్పనున్నారు. అందుకు నిదర్శనంగా బీసీ నాయకులు రాజకీయంగా కీలక స్థానాలకు ఎదగడానికి.. మండల స్థాయిలో ఆ వర్గాలకు తెదేపా కల్పించిన రిజర్వేషన్లు, పార్టీ వారికిచ్చిన ఆదరణే కారణమని సోదాహరణంగా ప్రజలకు వివరించనున్నారు. అందుకు తగినట్లే బాలయ్య ప్రసంగ పాఠాలు రెడీ చేసుకుంటున్నారు. ఇక అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం అంటూ పూర్తి స్దాయి విమర్శలకు దిగాలన్న ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications