చట్టబద్దతకు మందకృష్ణ డిమాండ్
విజయవాడ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వెంటనే చట్టబద్దత కల్పించేలా రాష్ట్రానికి చెందిన ప్రతిపక్షాలు కోరాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల నివాసాల వద్ద ఎమ్మార్పీఎస్ చేస్తున్న ఆందోళనను ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సమర్థించుకున్నారు. రాజమండ్రిలో తలపెట్టిన విశ్వరూప ప్రదర్శన జయప్రదం చేయాలని ఆయన కోరారు. వర్గీకరణకు చట్టబద్దత కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications