వైఎస్ జగన్ పోస్టర్లపై..

దాంతో ఎన్నికల నిబంధనావళిని ఖచ్చితంగా అమలు జరిపి తీరాల్సిందేనని జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. కరెంటు స్తంభాలు, మంచినీటిని సరఫరా చేసే పైపుల పైన కూడా జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ రాసిన రాతలను రెండ్రో జుల్లోగా తొలగించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని సిఇఒ చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశించారు. ఎవరి పేర్లతో గోడలపై రాతలు, పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయో ఆ నాయకుల చేతనే వాటిని తొలిగింపజేయాలని డాక్టర్ ఐవి సూచించారు. లేనిపక్షంలో వెంటనే చట్టరీత్యా బాధ్యులైన వ్యక్తు లపై చర్య తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశించారు. ఎన్నికల నిబంధ నావళిని అమలుపరచడంలోజిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications