'సాక్షి' చానల్ కు ఇసి మొట్టికాయ

YS Jagan
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ యాజమాన్యంలోని 'సాక్షి' టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే కొన్ని ప్రకటనలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..ప్రకటనలను ప్రసారం చేసే ముందు ఈసీ అనుమతి తీసుకోవాలన్న నిబంధనను పెడచెవిన పెట్టడాన్ని తప్పుపట్టింది. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రకటనలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు ప్రధానాధికారి హరిప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని ఇద్దరు కమిటీ సభ్యుల ఆమోదం పొందాలి.

ఆ కమిటీ పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాతనే సదరు ప్రకటనలను ప్రసారం చేసుకోవాలి. అయితే..టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టు యానిమేషన్‌తో రూపొందించిన ప్రకటనను కమిటీ అనుమతి లేకుండానే..సాక్షి ఛానల్‌ ప్రసారం చేసింది. దీనిని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మేరకు నోటీసులు జారీ చేయాలని మంగళవారం నిర్ణయించింది.

ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన రోజు నుంచీ వివిధ రాజకీయ పార్టీలు రూపొందించుకున్న ప్రకటనల్లో 31 ప్రకటనలకు ఈసీ అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్‌, టీడీపీ, పీఆర్పీలు ఇప్పటివరకు మొత్తం 33 ప్రకటనలను రూపొందించాయి. వాటిలో 31 ప్రకటనలకు అనుమతి లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+