హైదరాబాద్: ప్రజలకు మేం విన్నవించుకుంటున్నాం. ప్రతి పార్టీకి నిధులు అవసరం. అందులో భాగంగానే ప్రజారాజ్యం పార్టీకూడా విరాళాలను ఆహ్వానిస్తోంది అంటున్నారు పీఆర్పి పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్. అరవింద్ పార్టీ కార్యాలయంలో ఈ విషయాన్ని మీడియా సమక్షంలో ప్రకటించారు. ప్రజారాజ్యం పార్టీకి విరాళాలు ఇవ్వదలచుకున్న శ్రేయోభిలాషులు, అభిమానుల కోసం ఆ పార్టీ ప్రత్యేకంగా ఒక బ్యాంకు అకౌంట్‌ను ప్రారంభించింది. ఈ విషయం మాట్లాడుతూ పార్టీ నిర్వహణకు నిధులు ఇవ్వదలచుకున్న శ్రేయోభిలాషులు, అభిమానులు ఎలా ఇవ్వాలి అని అడుగుతున్నారు. అలాంటి వారి కోసం ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్, బంజారాహిల్స్ శాఖలో ఖాతా ప్రారంభించాం. అకౌంట్ నెంబర్: 737010138999. బ్రాంచ్ నెంబర్: ఆర్‌టిజిఎస్ నెం: 0007370. ఈ ఖాతాలో ఎవరు ఎంత ఇవ్వదలచుకుంటే అంత వేయవచ్చు. అలాగే, 'ప్రజారాజ్యం పార్టీ. ఒఆర్ జి' అనే వెబ్ సైట్ ద్వారా కూడా నిధులు బదిలీ చేసే వెసులుబాటు కల్పించాం' అని అరవింద్ స్పష్టం చేసారు.