చిరంజీవికి కోపమొచ్చింది

మొత్తం రసాభాసగా మారడంతో "మీకు నిన్నే చెప్పాను. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని, జాగ్రత్తలు తీసుకోవాలని. పదేపదే ఇలాగే జరుగుతోంది. 15 నిముషాల్లో మొత్తం సరిచేయండి అంటూ వేదిక దిగి ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత నేతలు హడావుడిగా అందరినీ బయటకు పంపి, సర్దుబాటు చేయడంతో చిరంజీవి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. మరో సందర్భంలో.. టికెట్ దక్కలేదని నిరసన తెలిపేందుకు వచ్చిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఆశావహుడు రాజలింగంపై చిరంజీవి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
అనుచరులతో కలిసి నిరసన తెలపబోయిన ఆయనకు చిరు షాక్ ఇచ్చారు. "షో చేశావుగా..మీడియా కవరేజి వచ్చిందిగా... ఇక వెళ్లు!" అంటూ ఆగ్రహించారు. జూబ్లీహిల్స్ నుంచి హుమాయూన్‌ను అభ్యర్థిగా రెండురోజుల క్రితం చిరంజీవి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ స్థానంపై ఆశ పెట్టుకున్న సంతోష్ యాదవ్, రాజలింగం గత రెండు రోజులుగా నిరసనల పర్వానికి తెరతీశారు. పార్టీ కార్యాలయం-1 వద్ద శనివారం తన అనుచరులతో సంతోష్ యాదవ్ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. రాజలింగం తన అనుచరగణంతో కలిసి ఆదివారం పార్టీ కార్యాలయం-2కి వచ్చి చిరంజీవి వాహనానికి అడ్డుగా ధర్నాకు దిగారు. దీంతో ఆగ్రహించిన ఆయన కారు దిగివచ్చి పైవిధంగా వ్యాఖ్యానించారు. ఆయన వెళ్లిపోయాక సెక్యూరిటీ సిబ్బందికీ, రాజలింగం అనుచరులకు మధ్య పెద్ద గలాటానే జరిగింది.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications