కడప: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై పోటీచేసే స్థాయి ముఖ్యమంత్రి తనయుడు వై.ఎస్.జగన్‌కు లేదని తెదేపా తెలిపింది. జగన్ కు సత్తా ఉంటే శ్రీకాంత్ రెడ్డి మీద గెలవాలని కడప జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి అన్నారు. ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నదీ లేనిది ఆయనకే స్పష్టం లేదని అందుకే గంటకో రకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి తనయుడు కాకపోతే జగన్‌ను పట్టించుకునే నాథుడే ఉండడని అన్నారు.
తాను కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని, దమ్ముంటే రామోజీరావు కానీ చంద్రబాబు నాయుడు కానీ తన మీద పోటీ చేయాలని జగన్ గత రెండు రోజులుగా సవాలు విసురుతున్నారు. ఆయన ఈ విషయాన్ని తన సాక్షిలో కూడా రాసుకున్నారు.