కాంగ్రెసుకు పెన్మత్స రాజీనామా
విజయనగరం: సీనియర్ శాసనసభ్యుడు పెన్మత్స సాంబశివరాజు కాంగ్రెసు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్ష పదవికి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనకు విజయనగరం లోకసభ సీటు ఇవ్వనందుకు నిరసనగా ఆయన రాజీనామా చేశారు. ఇక ఎంత మాత్రమూ కాంగ్రెసులో ఉండడం సరైంది కాదని రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.
విజయనగరం లోకసభ సీటుకు తన శిష్యుడు, మంత్రి బొత్సా సత్యనారాయణ భార్య బొత్సా ఝాన్సీకి ఇవ్వడంపై ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాను శాసనసభకు పోటీ చేయదలుచుకోలేదని, తనకు విజయనగరం లోకసభ సీటు కేటాయించాలని ఆయన చాలా కాలంగా పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయన డిమాండ్ ను పార్టీ నాయకత్వం బేఖాతర్ చేసింది.












Click it and Unblock the Notifications