హైదరాబాద్: చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీతో కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలోని మన పార్టీతో పొత్తు ఖరారైంది. ప్రజారాజ్యం పార్టీ నాయకుడు అల్లు అరవింద్ తో కాసాని జ్ఞానేశ్వర్ మంతనాలు ఫలించాయి. దీంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఖాయమైంది. కాసాని జ్ఞానేశ్వర్ రంగారెడ్డి జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం ప్రజారాజ్యంలో ఉన్న తూళ్ల దేవేందర్ గౌడ్ కు బంధువు కూడా. తెలుగుదేశం పార్టీలో దేవేందర్ గౌడ్ ఆధిపత్యాన్ని నిరసిస్తూనే కాసాని జ్ఢానేశ్వర్ బయటకు వచ్చారు. బిసి కులాలకు అధికార సాధన లక్ష్యంతో ఆయన మన పార్టీని స్థాపించారు. మనపార్టీకి నాలుగు శాసనసభా స్థానాలు, ఒక లోకసభ స్థానం కేటాయించేందుకు ప్రజారాజ్యం పార్టీ అంగీకరించింది.