ఎన్టీఆర్ బలిపశువు: లక్ష్మీపార్వతి
హైదరాబాద్: రోడ్డుప్రమాదంలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూనియర్ ఎన్టీఆర్‌ను లక్ష్మీ పార్వతి ఆదివారంనాడు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు జూనియర్‌ను బలి పశువును చేశారని, దీన్ని అర్థం చేసుకునే వయసు ఎన్టీఆర్ కు లేదని ఆమె అన్నారు. చంద్రబాబు వలలో ఆయన చిక్కుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబుపై లక్ష్మీపార్వతి మొదటి నుంచీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ఆమె ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి సహకారం అందించడానికి కూడా సిద్ధపడ్డారు. రెండు మూడు సార్లు ముఖ్యమంత్రిని ఆమె కలిశారు కూడా.












Click it and Unblock the Notifications