వరుణ్‌గాంధీపై నాసా కేసు
లక్నో: పిలిభిత్ కోర్టులో లొంగుబాటు సందర్భంగా వరుణ్‌గాంధీ, ఆయన మద్దతుదారులు పట్టణంలో అరాచకం సృష్టించటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయనపై జాతీయ భద్రతా చట్టం (నేషనల్ సెక్యూరిటీ యాక్ట్) కింద కేసు నమోదు చేయాలని యోచిస్తోంది. అక్కడ జరిగిన విధ్వంసంపై పిలిభిత్ కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై కార్యకర్తలు దాడులు చేశారని, ప్రభుత్వ ఆస్థులను ధ్వంసం చేశారని, మొత్తం పట్టణంలో తీవ్ర విధ్వంసం సృష్టించారని ఆయన నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. దీని ఆధారంగా ఆయనపై కేసు పెడతారని ఆ విషయాన్ని ఈరోజు జైల్లో ఉన్న వరుణ్‌కు తెలియజేస్తారని తెలుస్తోంది. వరుణఅ గాంధీపై హత్యా యత్నం ఆరోపణపై, ఇతర నేరారోపణలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.












Click it and Unblock the Notifications