చిరు పీఆర్పీఆఫీసుకు టులెట్ బోర్డు
హైదరాబాద్: పార్టీ టికెట్లు రాకపోవడంతో ఆగ్రహించిన ప్రజారాజ్యం పార్టీ నాయకుల అనుచరులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసానికి దిగుతున్నారు. వరంగల్‌లో కార్యకర్తలు వెరైటీగా నిరసన తెలిపారు. అక్కడ పీఆర్పీ కార్యాలయం ఓ ప్రైవేటు భవంతిలో కొనసాగుతోంది. ఆ ఇంటి యజమాని పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్నికల్లో టిక్కెట్ ఆశించారు. తీరా రెండో జాబితాలో కూడా తనకు టిక్కుట్ రాలేదని తెలిసి నిరాశ చెందారు. ఆ కోపంతో పార్టీ కార్యాలయానికి టులెట్ బోర్డు పెట్టారు. ఇదిచూసి దారినవెళ్లే వారంతా విస్మయం చెందుతున్నారు.
ప్రజారాజ్యం పార్టీలో పార్టీ అభ్యర్థుల జాబితాపై నిరసనలు తీవ్రమై చివరకు అరాచకానికి దారి తీస్తున్నాయి. శనివారం అనంతపురంలో టిక్కెట్లు రానివారు పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టటమే కాక టిక్కెట్ వచ్చిన అభ్యర్థిపై దాడికి యత్నించారు. ఆదివారంనాడు మహబూబ్‌నగర్ జిల్లాలో అది పునరావృతమైంది. జూపల్లి భాస్కరరావుకు కల్వకుర్తి టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా ప్రరాపా కార్యకర్తలు కల్వకుర్తి పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
అనంతపురం జిల్లా ప్రజారాజ్యం పార్టీలో అసంతృప్తులు తారాస్థాయికి చేరాయి. శనివారమంతా అనంతలో కార్యకర్తల నిరసనలు కొనసాగాయి. పార్టీ కార్యాలయంపై దాడులు జరిగాయి. ఇవి ఇంకా కొనసాగుతుండగానే గత రాత్రి అనంతపురం పీఆర్పీ అభ్యర్థి టీజే ప్రకాష్ కారుపై బాంబుదాడి జరిగింది. ఈ ఘటనపై ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని ప్రకాఫ్ తెలిపారు. దాడులకు భయపడేది లేదన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దాడలకు పాల్పడింది టిక్కెట్లు ఆశించి భంగపడినవారు కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications