విశాఖపై విముఖత లేదు: పురంధేశ్వరి
విశాఖపట్నం: విశాఖనుంచి పోటీ చేసేందుకు తాను విముఖత చూపినట్లు మీడియాలో వచ్చిన వార్తలను కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఖండించారు. బాపట్ల లోక్‌సభ సీటును తాను అడిగానని, అంతమాత్రాన విశాఖను వ్యతిరేకించినట్లు కాదని ఆమె అన్నారు. అధిష్టానం వీలును బట్టి సర్దుబాట్లు తప్పవని ఆమె అన్నారు. విశాఖ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు ఆమె ఆదివారంనాడు విశాఖ వచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానన్నారు. సోమవారం ఉదయం ఆమె నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన 8 రోజుల అనంతరం విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి, కేంద్రమంత్రి పురందరేశ్వరి నగరంలో కాలుమోపారు. స్థానిక సంపత్ వినాయకుని ఆలయం, కనక మహాలక్ష్మి ఆలయాల్లో ఆమె పూజలు జరిపారు.












Click it and Unblock the Notifications