స్వామివారి సన్నిధిలో బాలయ్య
తిరుపతి: తెలుగుదేశం పార్టీ నేత, సినీ హీరో బాలకృష్ణ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కడప జిల్లా నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు. కడప జిల్లాలో తన పర్యటనను ఆయన విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.
నాలుగు రోజుల పాటు సాగిన ఆయన కడప జిల్లాలో పర్యటించారు. ఆయన పర్యటనకు విశేష జనాదరణ లభించింది. ఆఖరు రోజున రాజంపేట, రైల్వేకోడూరులలో ఆయన పర్యటించారు. అనంతరం తిరుపతి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ బయలుదేరారు.












Click it and Unblock the Notifications