తెరాస ఎమ్మెల్యేలు అనర్హులు: హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యులకు హైకోర్టులో చుక్కెదురైంది. తెరాస శాసనసభ్యుల్లో ముగ్గురిపై గతంలో స్పీకర్ అనర్హత వేటు వేశారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్‌ను ధిక్కరించి 9 మంది ఎమ్మెల్యేలు మన పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. విప్ ను ధిక్కరించిన 9మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని 2007 మార్చి 17న తెరాస స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. స్పీకర్ సురేష్ రెడ్డి 24 వాయిదాల అనంతరం గత డిసెంబర్ 20వ తేదీన ముగ్గురిని అనర్హులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చారు.
తొమ్మిది మంది శాసనసభ్యుల్లో సోయం బాపూరావు, తూర్పు జయప్రకాష్‌రెడ్డి, మందాడి సత్యనారాయణ మినహా మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ నిర్ణయానికి ముందే తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ముగ్గురూ తమపై అనర్హత వేటు వేయటం అన్యాయమంటూ హైకోర్టులో కేసు వేశారు. దీంతో కోర్టు రెండు వారాల స్టే విధించింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన ధర్మాసనం ఈరోజు స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ తుది తీర్పు ఇచ్చింది. వీరంతా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications