రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
విజయవాడ: కృష్ణా జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందగా అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 214 జాతీయ రహదారిపై ముదినేపల్లి మండలం పెద పాలపర్రు వద్ద ఈ ప్రమాదం జరిగింది. కూలీలతో వస్తూ రోడ్డు పక్కన ఆగిఉన్న వ్యాన్‌ను వేగంగా వస్తున్న సిమెంట్ లారీ ఢీకొట్టింది.
కూలీల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన అయిదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కలిదిండి మండలం సానరుద్రవరం గ్రామానికి చెందిన వీరంతా చెరువులో చేపలు పట్టేందుకు ఉయ్యూరు మండలం ఓగిరాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications