కంధమాల్ బిజెపి అభ్యర్థి అరెస్టు
కంధమాల్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై పోలీసులు మంగళవారం బిజెపి కంధమాల్ లోకసభ అభ్యర్థి అశోక్ సాహూను అరెస్టు చేశారు. ఫూల్బానీ ర్యాలీలో ప్రసంగిస్తుండగా పోలీసులు సాహూను అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా ఆయన పరారీలో ఉన్నారు. 36 మంది క్రిస్టియన్లు మరణించిన కంధమాల్ లో సాహూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారనే ఆరోపణపై కేసు నమోదైంది.
చర్చి మత మార్పిడులకు పాల్పడుతోందని, కాంగ్రెసు రాజ్యసభ పార్లమెంటు సభ్యుడు రాధాకాంతా నాయక్ క్రైస్తవాన్ని విస్తృతం చేయడానికి విదేశీ కరెన్సీ వాడుతున్నారని సాహూ ఈ నెల 5వ తేదీన రైకియా బహిరంగ సభలో ఆరోపించారు.












Click it and Unblock the Notifications