అవసరమైతే గృహ నిర్బంధం: సిఇవో
హైదరాబాద్: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నాయకులకు గృహ నిర్బంధం విధిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ (సిఇవో)సుబ్బారావు చెప్పారు. రేపటి పోలింగ్ ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని 22 లోకసభ స్థానాలకు, 154 శాసనసభా స్థానాలకు రేపు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. నాలుగు గంటల వరకు పోలింగ్ కేంద్రానికి చేరుకునే వారంతా సమయం గడిచిన తర్వాత కూడా ఓటు వేయవచ్చునని సుబ్బారావు చెప్పారు.
పోలింగ్ కోసం 36,124 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 72,973 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. 3,530 సంచార తనిఖీ బృందాలు పోలింగును పర్యవేక్షిస్తాయి. పోలింగ్ పర్యవేక్షణకు 353 ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. సిఇవో సుబ్బారావు బుధవారం ఉదయం హైదరాబాదులో పోలింగ్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఆయన హైదరాబాదులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications