ఎన్టీఆర్ మళ్లీ వస్తాడు: బాబు

నగదు బదిలీ పథకాన్ని తాము అమలు చేసి తీరుతామని ఆయన చెప్పారు. దాన్ని అమలు చేయలేరనే ముఖ్యమంత్రి వ్యాఖ్యను ఆయన ఖండించారు. ఎన్నికల్లో కాంగ్రెసు నాయకులు డబ్బులు వెదజల్లుతారని, ఎక్కడ కొట్టినా వారి నుంచి డబ్బులు రాలుతాయని, ఆ పాపిష్టి డబ్బుకు లొంగిపోవద్దని ఆయన అన్నారు. ఒక్క ఓటు కూడా అమూల్యమైనదేనని, దాన్ని కాంగ్రెసును ఓడించడానికి వాడాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు అవినీతి సొమ్ముతో కోట్ల రూపాయలకు పడగలెత్తారని ఆయన విమర్శించారు. తాము ఇచ్చిన హామీలను అన్నింటినీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications