చంద్రబాబు పిట్టల దొర: వైయస్

YS Rajasekhar Reddy
విజయవాడ‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిట్టల దొర లాగా వాగ్దానాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం ఉదయం విజయవాడలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలు రాగానే ఆకాశాన్ని దించి ప్రజల కాళ్ల ముందు ఉంచుతానని చంద్రబాబు అంటున్నారని ఆయన అన్నారు. ఎన్నికల ప్రణాళికను అమలు చేసే సంప్రదాయం చంద్రబాబుకు లేదని, వాగ్దానాలను విస్మరించిన చరిత్ర చంద్రబాబుకు ఉందని ఆయన అన్నారు.

ఎన్నికల ప్రణాళిక రాజకీయ పార్టీలకు మతగ్రంథం లాంటిదని, దాన్నే చంద్రబాబు పట్టించుకోరని ఆయన అన్నారు. తాను ప్రస్తుతం ఇస్తున్న హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారంటే స్విస్ బ్యాంక్ డబ్బులు తెస్తామని అంటున్నారని ఆయన అన్నారు. తన ఆస్తులు ఏడాది క్రితం వేయి కోట్ల రూపాయలు అన్న చంద్రబాబు ఇప్పుడు లక్ష కోట్ల రూపాయలు అంటున్నారని, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. గతంలో ఎన్నికలకు ముందు రోష్నీ, ముందడుగు వంటి పథకాలను ప్రకటించి ఆ తర్వాత చంద్రబాబు వాటి ఊసే ఎత్తలేదని ఆయన అన్నారు.

తమపై ప్రజలకు విశ్వసనీయత ఉందని, ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఆయన అన్నారు. తాము రెండో వాగ్దానాలను ప్రజలకు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం కింద ఇస్తున్న బియ్యం కోటాను కుటుంబానికి 30 కిలోలకు పెంచుతామని, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను రోజుకు 7 గంటల నుంచి 9 గంటలకు పెంచుతామని ఆయన చెప్పారు.ప్రస్తుతం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తాము తిరిగి అధికారంలో వస్తే మరింత సమర్థంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+