పాక్ దాడిలో 27 మంది మృతి
ఇస్లామాబాద్: పాక్‌లో జరిగిన ఓ ఆత్మాహుతి దాడిలో 27 మంది మృతి చెందగా 62 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో అధికశాతం మంది పోలీసులు, సైనికులు. హంగు పట్టణంలోనిచెక్‌పోస్టు వద్ద ఈ దాడి జరిగింది. దాడిలో స్థానిక పోలీస్ చీఫ్ కూడా మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని పాక్ తాలిబన్లు ప్రకటించారు.
మృతుల్లో 18 మంది భద్రతాధికారులు, ఇద్దరు పౌరులు కూడా ఉన్నారు. గాయపడినవారిని హంగు, పెషావర్ ఆస్పత్రులకు తరలించారు. ఈ పేలుడుతో పక్కన ఉన్న పలు భవంతులు కూడా ధ్వంసమయ్యాయి. ఏప్రిల్ 15వ తేదీన ఇటువంటి పేలుడే సంభవించింది. చర్సద్దా నగరం శివారులో జరిగిన ఈ పేలుడులో 16 మంది మరణించారు.












Click it and Unblock the Notifications