పరకాలకు చిరంజీవి సవాల్
అనంతపురం: ప్రజారాజ్యం అభ్యర్థుల జాబితాలో బోగస్ బీసీలు లేనేలేరని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్పష్టం చేశారు. అనంతపురంలో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీలకు నిజమైన ప్రాతినిథ్యం కల్పించింది, సామాజిక న్యాయాన్ని ఆచరణలో చూపింది తమ పార్టీయేనని అన్నారు. తాము బోగస్ బీసీలకు టిక్కెట్లు ఇచ్చామని ఆరోపిస్తున్న పరకాల ప్రభాకర్‌కు దమ్ముంటే బోగస్‌ల జాబితాను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను చూస్తుంటే అసహ్యం వేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై ఆయన తీవ్ర విమర్సలు చేశారు. ఎన్నికల్లో తమదే విజయమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications