వైయస్ పై ఈసీకి కూటమి ఫిర్యాదు
హైదరాబాద్: మలి దశ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా చేస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రసంగాలను అడ్డుకోవాలంటూ మహాకూటమి నేతలు ఆదివారం ఎన్నికల ప్రధానాధికారి ఐవి సుబ్బారావును కోరారు. ఈమేరకు వారు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. పాతబస్తీలో డీజీపీ మహంతిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీపై కూడా చర్య తీసుకోవాలని వారు ఈసీని కోరారు.
తెలంగాణపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మనం హైదరాబాదుకు విదేశీయులం అవుతామని, పోతిరెడ్డిపాడుకు నీరు రాదని ఆయన నంద్యాల ఎన్నికల ప్రచార సభలో మాట్లాడి దుమారానికి తెర తీశారు. దమ్ముంటే పోలీసు డ్రెస్ తీసేసి పాతబస్తీకి రావాలని అసదుద్దీన్ ఓవైసీ డిజిపి మహంతిని సవాల్ చేశారు.












Click it and Unblock the Notifications