లాలూ ఆరోపణకు ప్రధాని ఖండన

గౌహతి: బాబ్రీ మసీదు విధ్వంసానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఆరోపణను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఖండించారు. నిర్మాణాన్ని కాపాడుతామని అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఇచ్చిన హామీని కాంగ్రెసు నమ్మడమే పొరపాటని ఆయన అన్నారు. కళ్యాణ్ సింగ్ కోర్టుకు ఇచ్చిన హామీని నమ్మడమే తప్పయితే కాంగ్రెస్ పార్టీని నిందించవచ్చునని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

మతవాదం దేశ ఐక్యతకు, లౌకిక విలువల కోసం నిలబడిన కాంగ్రెసుకు పెద్ద ప్రమాదకారని అని ఆయన చెప్పారు. భారత సమగ్రతకు ఉగ్రవాదం, తీవ్రవాదం రెండు కూడా ముప్పేనని ఆయన అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+