అప్పుడు కెసిఆర్ తెలియదా: రాఘవులు
విజయవాడ: రాష్ట్ర ప్రజలపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఎలాంటి ప్రేమ లేదని, ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టి విద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు రాబట్టేందుకే తెలంగాణా గురించి భయపెడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. తెరాస అధ్యక్ష్డు కెసీఆర్ వ్యాఖ్యల గురించి ఇంతగా మాట్లాడుతున్న సీఎం ఆయన ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు మాట్లాడకుండా, చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఇప్పుడు దాన్ని ఖండించటం కేవలం విద్వేషాలను రెచ్చగొట్టేందుకే అని అన్నారు.
కేసీఆర్ స్వరమేమిటో 2004లో ఆయనతో జత కట్టినప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. విజయవాడలో మహాకూటమి అభ్యర్థుల విజయంకోసం ఆయన రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణాపై తాము ఎప్పుడూ ఒకే మాటపై ఉన్నామని అన్నారు. తెలంగాణా వస్తే ఆంధ్రప్రాంతం వారు విదేశీయుల్లా బతకాలని అంటున్నారని ముఖ్యమంత్రి తనయుడు కర్ణాటకలో పరిశ్రమలు పెట్టి బెంగుళూరులో బంగళాలు కట్టలేదా, వై.ఎస్ సన్నిహితుడు గాలి జనార్థనరెడ్డి ఏకంగా కర్ణాటక మంత్రివర్గంలోనే ఉన్నాడని అన్నారు. వై.ఎస్ ఏం చెప్పినా ఈసారి మహాకూటమి విజయం తథ్యమని అన్నారు.












Click it and Unblock the Notifications