పందికొక్కుల్లా మేశారు: వైయస్

కడప: పనికి ఆహార పథకం బియ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పచ్చచొక్కాలవారు పందికొక్కుల్లా మేశారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. కడప జిల్లా రాయచోటి ఎన్నికల ప్రచార సభలో ఆయన ఆదివారం సాయంత్రం ప్రసంగించారు. తెలుగుదేశం ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాటు రైతులను పట్టించుకోలేదని ఆయన అన్నారు. తాము అధికారంలో వచ్చిన తర్వాత వ్యవసాయాన్ని దండుగ కాకుండా పండుగ చేశామని ఆయన చెప్పారు. తాము అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు.

రైతుల రుణాలను మాఫీ చేశామని, ఉచితంగా విద్యుత్తు ఇస్తున్నామని ఆయన చెప్పారు. మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తున్నామని ఆయన చెప్పారు. బడుగుల పిల్లలకు ఫీజులు ప్రభుత్వమే చెల్లిస్తోందని ఆయన చెప్పారు. ఉద్యోగ, విద్యారంగాల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+