కెసిఆర్ అనలేదా?: వైయస్
చిత్తూరు: రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న పోరాటమని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆయన ఆదివారం ఉదయం మీడియా ప్రనిధులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పింది ఎప్పుడూ చేయడని, ఆ విషయం రాష్ట్రంలో అందరికీ తెలుసని ఆయన అన్నారు.విశ్వసనీయతకు తాము మారుపేరని పేపర్లలో వారు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ప్రజలు నమ్మి ఓటేయరని అన్నారు. తాము మాత్రమే మాటకు కట్టుబడి ఉంటామని, ఆ విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు.
తెలంగాణాపై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉంటానని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోతిరెడ్డిపాడు ఆగిపోతుందని అన్నారు. పోతిరెడ్డి పాడుకు తాము వ్యతిరేకమని చంద్రబాబు చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. ఆంధ్ర భోజనం హోటళ్లకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అద్యక్షుడు కె. చంద్రశేఖరరావు ప్రకటన చేసారని ఆయన చెప్పారు. కార్పోరేట్ విద్యాసంస్థలను మూయిస్తామని కెసిఆర్ అన్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications