హైదరాబాద్: జిల్లాలవారిగా సమీక్షలు జరుపుతున్న ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి గురువారంనాడు నెల్లూరు జిల్లా పరిస్థితిని సమీక్షించారు. ఈ జిల్లా అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలిసారిగా సామాజిక న్యాయాన్ని అమలు చేసి కోవూరు స్థానాన్ని మునెమ్మకు ఇవ్వటం ద్వారా ప్రజారాజ్యం పార్టీ ప్రజలకు చేరువైందని జిల్లా కన్వీనర్ రాఘవేందర్‌రెడ్డి చిరంజీవికి వివరించారు. ప్రజలు తనను ఎంతో ఆదరించారని, ఎన్నికల ఖర్చు కూడా వారే ఇచ్చారని, తన విజయం తథ్యమని మునెమ్మ అన్నారు.