కాబోయే ప్రధాని అద్వాని: కేసీఆర్
లూథియానా: దేశానికి కాబోయే ప్రధాని అద్వానీయే అని టీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావు జోశ్యం చెప్పారు. లూథియానా సభలో ఆయన మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని, తాము ఎన్డీయేకు మద్దతిస్తామని చెప్పారు. ఉక్కుమనిషి నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.50 సంవత్సరాల తెలంగాణ పోరాటానికి అద్వానీ ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందని ఆశిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ విశ్వాసఘాతకానికి పాల్పడిందని విమర్శలు గుప్పించారు. అలాగే తాను ప్రకాశ్‌సింగ్ బాదల్ కోరిక మేరకే ఎన్డీఏ ర్యాలీకి వచ్చినట్లు తెలిపారు. సభలో కేసీఆర్ కేవలం మూడు నిమిషాలు మాత్రమే ప్రసంగించినా ఘాటుగానే విమర్శనాస్త్రాలు సంధించారుచ. వేదికపై ఉన్న ఎన్డీఏ నేతలందరితో ఆయన కరచాలనం చేశారు.












Click it and Unblock the Notifications