కొండను గుద్దిన బస్సు
కర్నూలు: మెదక్ నుంచి తిరుపతి వెళుతున్న ఓ ఆర్టీసీ బస్సు ఈ ఉదయం కొండను ఢీకొంది. కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు.












Click it and Unblock the Notifications