మళ్ళీ తీవ్రవాద దాడులు..హెచ్చరిక
వాషింగ్టన్: భారత్‌కు తీవ్రవాదుల ద్వారా మరోసారి దాడులు జరిగే అవకాశం వుందని విశ్రాంత సీఐఏ అధికారి బ్రూన్ రిడెల్ హెచ్చరించారు. ముంబాయి తరహాలో భారత్‌లో మరిన్నీ ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదముందని ఆయన అన్నారు. పాకిస్థాన్‌లోని జిహాదీశక్తులను ఇందుకు కుట్ర పన్నుతున్నాయని ఆయన వెల్లడించారు. పాక్‌లోని ఉగ్రవాద శక్తులను నిర్మూలించే బదులు పాక్ సైన్యం భారత్ సరిహద్దుల్లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తొందన్నారు. పవిత్ర యుద్ధం పేరుతో పాక్‌లో అరాచకం సృష్టిస్తున్న జిహాది శక్తులను తరిమి కొట్టకపోతే అవి దేశం మొత్తం విస్తరించే ప్రమాదం ఉందని... ఇది ప్రపంచానికి కీడు చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications