సచిన్ జట్టుతో నేడు కుంబ్లే సేన ఢీ
పోర్ట్ ఎలిజబెత్: టోర్నీ ఆరంభంలో విజయాలను నమోదు చేసుకున్న ముంబాయి సేన వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి టోర్నీ నుంచే వైదొలిగే పరిస్థితి వచ్చింది. కీలకమైన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఘోరంగా ఓడిన ముంబాయి సెమీస్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌లో నెగ్గి తీరాల్సిందే. జయసూర్యను పక్కకుపెట్టి సచిన్ చేసిన ప్రయోగం విఫలం అయింది. మిడిలార్డర్‌లో డుమిని తప్ప మిగిలిన బ్యాట్స్‌మెన్ రాణించలేకపోతున్నారు. బౌలర్లు సత్తా చాటుతున్నా బ్యాట్స్‌మెన్ విఫలం అవ్వడమే జట్టును బాధిస్తొంది. ఈసారి జయసూర్య-సచిన్ ఓపెనర్లుగా దిగే అవకాశాలున్నాయి. ఢిల్లీ మ్యాచ్‌లో సనత్‌ను పక్కన బెట్టిన ముంబయి ఈసారి ఆ సాహసానికి పోయే అవకాశం లేదు. తొలి దశ మ్యాచుల్లో నిలకడగా రాణించిన మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ ప్రస్తుతం ఆ స్థాయి ఆటను కనబరచలేక పోతున్నాడు.
ఇక, బెంగళూరు ఆశలన్నీ స్టార్ బ్యాట్స్‌మన్ కలిస్‌పైనే ఉన్నాయి. సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్న అతను ఈ మ్యాచ్‌లోనూ విజృంభిస్తే జట్టుకు విజయం నల్లేరుపై నడకే. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడడం ద్వా రా చాలెంజర్స్ విజయాలకు బ్రేకు ప డింది. ఈ మ్యాచ్‌లో గెలువడం ద్వా రా మళ్లీ గాడిలో పడాలనే పట్టుదల తో చాలెంజర్స్ ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క లిస్, బౌచర్, ద్రవిడ్, గోస్వామి వంటి స్టార్లు జట్టులో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా అనిల్‌కుంబ్లే, ప్రవీణ్‌కుమార్ నిలకడగా రాణిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications