ఎన్డీయెలో చేరం: చిరంజీవి

రాష్ట్రంలో ఎవరితో కలిసే అవకాశముందని ప్రశ్నించగా తామే సొంతగా అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సినీనిర్మాత అశ్వనీదత్ తనను కలిసినట్లు చెప్పారు. తెదేపాతో అవగాహన గురించి ఆయన వద్ద ప్రస్తావించగా ఫలితాలు వచ్చాక మాట్లాడదామని బదులిచ్చానని వివరించారు. కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారని ప్రశ్నించగా నాలుగో ఫ్రంట్ ఉంది కదా అని చెప్పారు. ప్రధాని అభ్యర్దిగా ఎవరికి మద్దతిస్తారని ప్రశ్నించగా ఫలితాలొచ్చాక మాట్లాడదామని, దీనికి ఇంకా సమయముందని జవాబిచ్చారు. మూడో కూటమి గురించి ప్రస్తావించగా అది అసలు ఉంటుందో, లేదోనని వ్యాఖ్యానించారు. అమెరికా రాయబారి మల్‌ఫోర్డు తనను కలిసినట్లు జరిగిన ప్రచారం వాస్తవం కాదని, మల్ ఫోర్డు పదవి నుంచి వైదొలగే చాలాకాలం అయిందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని కాన్సులేట్ మర్యాదపూర్వకంగా తనను కలిసేందుకు సమయం అడిగారని, మంగళవారం సాయంత్రం ఆయన కలవనున్నారని వెల్లడించారు.












Click it and Unblock the Notifications